సీనియర్ బ్యూటీ లయ `తమ్ముడు` మూవీతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో యూత్ స్టార్ నితిన్ హీరో కాగా.. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటించారు. దిల్ రాజు నిర్మించిన తమ్ముడు సినిమా జూలై 4న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ప్రచార కార్యక్రమాల ద్వారా మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇకపోతే అక్కాతమ్ముడు అనుబంధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నితిన్ కు అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో లయ నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. తమ్ముడు సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. వివాహం అనంతరం లయ అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా చేసేవారు. 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చిన లయ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూలు చూసి అదే ఏడాది జూన్ లో తమ్ముడు మూవీ టీం లయను కాంటాక్ట్ అయ్యారట. స్టోరీని ఒక లైన్ గా చెప్పి.. ఆమె క్యారెక్టర్ గురించి వివరించారట. స్టోరీ లైన్ నచ్చడం, అలాగే తన పాత్ర కథలో చాలా కీలకంగా ఉండడంతో తమ్ముడు సినిమాకు లయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంతేకాదండోయ్ ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం వెయిట్ పెరగాలని డైరెక్టర్ చెప్పడంతో లయ రెగ్యులర్ గా స్వీట్స్ తినడం ప్రారంభించారట. అలా తింటూ తింటూ దాదాపు 7 కేజీల వరకు బరువు పెరగానని తాజా ఇంటర్వ్యూలో లయ స్వయంగా వెల్లడించారు.
ఇక తమ్ముడు సినిమా కోసం హైదరాబాద్ రావాలి అనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ మానేశానని లయ తెలిపారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ స్ట్రిక్ట్ ఆఫీసర్.. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుందని లయ వివరించింది. తమ్ముడు ఫలితంపై కూడా ఆమె ధీమా వ్యక్తం చేసింది. మరి ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ్ముడు సినిమా లయకు ఎటువంటి రిజల్డ్ ను అందిస్తుందో చూడాలి.