శ్రీవారికే శఠగోపం

News Image
Views Views
Shares 0 Shares

టూరిజం ముసుగులో ‘టికెట్ల’ దోపిడీబస్సు వేయకుండానే భక్తులకు స్వామి దర్శనంఆంధ్ర పర్యాటక శాఖలో అధికారుల చేతివాటంజగన్‌ సన్నిహిత అధికారి కనుసన్నల్లోనే స్కాంఒక్కో టికెట్‌కు రూ.2 వేల వసూలుఇందులో టీటీడీకి రూ.300 చెల్లింపు..ఆహారం, వసతి పేరుతో రూ.500మిగతా మొత్తం నకిలీ రవాణా సంస్థ ఖాతాలోటీటీడీకి కొత్త చైర్మన్‌ రాగానే టూరిజం కోటా టికెట్లు రద్దు   జగన్‌ హయాంలో సీఎం కార్యాలయం నుంచి దిగువ దాకా అవినీతి పరిఢవిల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానాల వేదికగా వైసీపీ అగ్ర నేతలు చేయని అరాచకాలు లేవు. శ్రీవేంకటేశ్వరుడి మాటున యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. శ్రీవారి దర్శనం పేరుతో వందలు, వేల కోట్లు కొల్లగొట్టారు. శ్రీవాణి ట్రస్టు పేరుతోనే కాదు.. పర్యాటక శాఖ పేరుతోనూ దందా సాగించారు. టూరిజం బస్సులు వేయకుండానే టికెట్లు అమ్మి.. సొమ్మంతా సొంత జేబుల్లో వేసుకున్నారు. రుషికొండను బోడిగుండు చేసి పర్యాటక శాఖ నిధులతో రూ.500 కోట్లు పెట్టి జగన్‌ ప్యాలెస్‌ కట్టుకుంటే.. తామేనా తక్కువ తిన్నది అన్నట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు తిరుమలేశుడికే శఠగోపం పెట్టారు. పర్యాటకులకు స్వామి దర్శనం చేయించడానికి టీటీడీ ఆ శాఖకు కేటాయించిన టికెట్లను అడ్డూ అదుపు లేకుండా అమ్మేసుకున్నారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ దందా సాగింది. టీటీడీ బోర్డు కొత్త చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వచ్చీ రావడంతోనే ఆ టికెట్ల కేటాయింపును మొత్తానికే రద్దుచేసేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రవాణా విభాగంలో జరిగిన ఈ భారీ స్కాంపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. టీటీడీ పర్యాటక శాఖకు రోజుకు 4 వేల టికెట్లు (రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం) కేటాయించేది. మన రాష్ట్రం, ఇతర రాషా్ట్రల్లోని భక్తులకు పర్యాటక శాఖ ఈ టికెట్లు జారీ చేసేది. బస్సు తిరిగే రూట్‌ను బట్టి ధర మారేది. తిరుమలకు వెళ్లే, వచ్చే దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలకు కూడా తీసుకెళ్లేది. టికెట్‌కు రూ.1,200 వసూలు చేసేది. ఇందులో దర్శనం కోసం టీటీడీకి రూ.300 చొప్పున చెల్లించేది. భక్తులకు అవసరమైన ఆహారం, వసతి సౌకర్యాలకు కొంత వసూలు చేసేది. ఈ విధానాన్ని కొందరు అధికారులు స్వార్థానాకి ఉపయోగించుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఏపీటీడీసీ కార్పొరేషన్‌.. జాయుంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ మోడ్‌ అనే కొత్త స్కీం తీసుకొచ్చింది. దీనిని కేవలం టీటీడీ దర్శన టికెట్లు అమ్మడానికి మాత్రమే సృష్టించారు. ఈ విధానంలో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులు తీసుకున్నారు. ఏపీటీడీసీ నుంచి ఆహారం, వసతి ఏర్పాటు చేశారు. ఈ స్కీం కింద ఐదు రూట్‌లలో బస్సులు నడిపారు. చెన్నై నుంచి రెండు బస్సులు, బెంగుళూరు నుంచి ఒకటి, ఒంగోలు నుంచి మరొకటి అందుబాటులోకి తెచ్చారు. ఇది కాకుండా రాయచోటి నుంచి ఇంకో బస్సును నడిపించారు. రాయచోటి నుంచి జనం ఎక్కే అవకాశమే లేకున్నా బస్సును ఎందుకు ఆపరేట్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కీం వెనుక జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి హస్తం ఉంది. ఆయన కింద పని చేసిన మహిళా అధికారి భర్త ఏపీటీడీసీలో కీలక స్థానంలో ఉన్నారు. సదరు అధికారి బంఽధువును టూరిజం శాఖ తిరుపతి డివిజన్‌లో ప్రధాన పోస్టులో నియమించారు. ఈ ముగ్గురూ కలిసి ఏపీటీడీసీ రవాణా విభాగాన్ని తమ నియంత్రణలో పెట్టుకున్నారు. ఒంగోలు బస్సులో 40 టికెట్లు, రాయచోటి బస్సులో 40 టికెట్లు, చెన్నై రెండు బస్సుల్లో 80 టికెట్లు, బెంగళూరు బస్సులో 40 టికెట్లు.. ఇలా రోజుకు 200 తిరుమల టికెట్లు అందుబాటులో ఉంచారు. ప్రతి టికెట్‌ ధర రూ.2,000. అక్కడే అసలు మతలబు ఉంది. చాలా మంది భక్తులు టికెట్లు కొనుగోలు చేస్తారు. కానీ ఏపీటీడీసీ ఏర్పాటుచేసే బస్సుల్లో ప్రయాణం చేసి తిరుమల వెళ్లేందుకు మొగ్గు చూపరు. ఎవరికి వారు వారి సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లి.. ఏపీటీడీసీ అందించిన దర్శనం టికెట్ల ద్వారా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లిపోతారు. ఈ విషయాన్ని గ్రహించిన పై ముగ్గురు అధికారులు ఒంగోలు, రాయచోటి నుంచి నడిపే బస్సులను ఆపేశారు. చెన్నై నుంచి ఒకటే నడిపారు. బెంగళూరు నుంచి నడిచే బస్సును యథాతథంగా తిప్పారు.

Recent Comments
Leave a Comment

Related News