మంచు విష్ణు మెయిన్ లీడ్ గా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `కన్నప్ప`. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఎక్స్‌లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కన్నప్ప కోసం ప్రభాస్, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి టాప్ స్టార్స్ రంగంలోకి దిగారు. అలాగే స్టార్ టెక్నీషియన్స్ పనిచేశారు. తనికెళ్ల భరణి, తదితరులు ఈ సినిమాకు కథను సమకూర్చారు. వీరంతా సినిమా విజయంలో కీలక పాత్రను పోషించారు.
ముఖ్యంగా కన్నప్పకు ప్రభాస్ తీసుకొచ్చిన హైప్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ ఉన్నాడన్న ఒక్క కారణంతోనే థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులు ఎందరో. ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో మంచు విష్ణు ఎటువంటి ఈగోలకు పోలేదు. కన్నప్పకు భారీ ఓపెనింగ్స్ రావడానికి మెయిన్ రీజన్ ప్రభాసే అని మంచు విష్ణు తాజా ప్రెస్ మీట్ లో నిర్మోహమాటంగా చెప్పేశాడు.
అలాగే టాలీవుడ్ లో ఎందరో టాప్ డైరెక్టర్స్ ఉండగా కన్నప్ప వంటి భారీ బడ్జెట్ సినిమా కోసం ముఖేష్ కుమార్ సింగ్‌నే ఎందుకు నమ్ముకున్నారు అనే ప్రశ్న ఎదురుకాగా.. మంచు విష్ణు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. తన గత రెండు మూడు చిత్రాలు ఎలా పర్ఫార్మ్ చేశాయో అందరికీ తెలుసు. ఒకవేళ కన్నప్ప స్క్రిప్ట్ ను పట్టుకొని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఎవర్ని కలిసిన నాతో సినిమా తీసేందుకు వాళ్ళు ముందుకు వచ్చేవారు కాదు. అందుకే మహాభారతం వంటి ఎపిక్ సీరియల్ తీసిన ముఖేష్ కు ఆ బాధ్యతలు అప్పగించామని మంచు విష్ణు కుండబద్దలు కొట్టాడు. ఏదేమైనా కన్నప్ప ఓపెనింగ్స్ క్రెడిట్ ను ప్రభాస్ కు ఇచ్చేయడం, టాలీవుడ్ డైరెక్టర్స్ తనతో సినిమా చేయరని స్వయంగా ఒప్పుకోవడం వంటి అంశాలు మంచు విష్ణును మరో మెట్టు ఎక్కించాయి. ఈ రెండు విషయాల్లో విష్ణును మెచ్చుకోవాల్సిందే రా అని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.