టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దిల్ రాజు. జీరో నుంచి స్టార్ట్ అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో దిల్ రాజు ఐదు పదుల వయసులో రెండో వివాహం వైపు మొగ్గు చూపడం ఎంతటి చర్చనీయాంశం అయిందో తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. ఈ దంపతులకు హన్షిత రెడ్డి అనే కుమార్తె ఉంది. ఆమెకు పెళ్లై పిల్లలు కూడా జన్మించారు.
అయితే 2017లో అనిత గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఒంటరైన దిల్ రాజు.. 2020 సంవత్సరంలో హైదరాబాద్ కు చెందిన తేజస్వినితో రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ దంపతులకు 2022లో అన్వయ్ రెడ్డి అనే కుమారుడు జన్మించడం జరిగింది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని.. తన పెళ్లి మరియు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజుతో తన వివాహం అంత సులభంగా ఏమీ జరగలేదని తేజస్విని తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ గురించి తేజస్వినికి పెద్దగా తెలియని సమయంలో దిల్ రాజుతో పరిచయం ఏర్పడిందట. మొదట ఆయన్ను డైరెక్టర్ అనుకున్న తేజస్విని.. గూగుల్ లో సెర్చ్ చేయగా నిర్మాత అని తెలుసుకుందట. అయితే అప్పటికే దిల్ రాజకు పెళ్లి జరిగి కూతురు ఉండడంతో ఆయనతో సంబంధాన్ని కొనసాగించడానికి తేజస్విని వెనక్కి తగ్గారు. కానీ కొద్ది రోజులకు ఆమె ఆలోచనలో మార్పు వచ్చిందట. నిజాయితీతో ఉండే వ్యక్తి కావడంతో దిల్ రాజుకు తేజస్విని దగ్గర అయ్యారు.
అయితే వీరి వివాహానికి తేజస్విని ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. అలా అని దిల్ రాజు వెనకడుగు వేయలేదు. తేజస్విని ఇంట్లో అందర్నీ ఒప్పించే ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో తేజస్విని స్వయంగా తెలిపారు. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం భర్త మరియు కొడుకు అన్వాయ్ తో చాలా సంతోషంగా ఉన్నానని, తనకు మరో బిడ్డ వద్దని తేజస్విని పేర్కొంది.