పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఓవైపు షూటింగ్స్, మరోవైపు పొలిటికల్ మీటింగ్స్ తో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు. పైగా ఈ మధ్య మరింత హ్యాండ్సమ్ గా కూడా మారారు. కుంభమేళా సమయంలో పవన్ లుక్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు సమాధానంగా రెండు మూడు నెలల్లోనే పవన్ దాదాపు పది కేజీల బరువు తగ్గారు.
తాజాగా కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. గత కొంతకాలం నుంచి వదులుగా ఉండే కుర్తా పైజామాకే పరిమితమైన పవన్ కళ్యాణ్.. లేటెస్ట్‌గా వైట్ అండ్ వైట్ పంచె, షర్ట్, బ్లాక్ గాగుల్స్ ధరించి ఫ్లైట్ దిగుతూ నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో పవన్ స్వాగ్ చూసి అభిమానులు వెర్రెక్కి పోతున్నారు. పవన్ కొత్త లుక్ అందరి ఆకట్టుకుంటోంది. అదే సమయంలో కొందరి చూపులు పవన్ ధరించిన చెప్పులపై పడ్డాయి.
చూడడానికి పవన్ బెల్ట్ చెప్పులు సింపుల్ గా ఉన్నా కూడా ధర తెలిస్తే మాత్రం షాక్ అయిపోతారు. నిక్ కామ్ బ్రాండ్ కు చెందిన చెప్పులు పవన్ ధరించారు. వీటి ధర రూ. 7 వేలు. మధ్యతరగతి ప్రజలకు ఈ రేటు ఎక్కవనే అనిపించినా.. కాస్త బాగా సంపాదించేవారైతే పవన్ చెప్పులను కొనేయొచ్చు. ఇక స్టార్ హీరో, పైగా ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయిన పవన్ రేంజ్ కు మాత్రం ఆ చెప్పుల ధర చాలా తక్కువ.