ఏపీకి నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడి రాజకీయ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజనరీగా పేరొందిన చంద్రబాబు.. ఏ విషయంలో అయినా దూరదృష్టితో ఆలోచిస్తుంటారు. ఎంతటి క్లిష్ట సమయంలోనైనా సహనం, ఓర్పుతో వ్యవహరిస్తారు. లౌక్యంగా మాట్లాడతారు. అందుకే ఆయన్ను విమర్శించే వారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అంగీకరించక తప్పదు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, పరాజయాలు వచ్చినప్పుడు కృంగిపోవడం ఆయనకు తెలియదు. సంక్షోపాలనే అవకాశాలుగా మార్చుకుంటూ ఎదిగిన చంద్రబాబు.. ఫస్ట్ టైమ్ బోల్డ్ గా మాట్లాడారు.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఇటీవలె ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం వెలగపూడి సచివాలయం వద్ద `సుపరిపాలనలో తొలి అడుగు` కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మంత్రులందరితో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూనే మాట్లాడుతారు. అదే రాజకీయ వ్యూహం. చాలా మంది నాయకులు కూడా ఏమీ చేయకపోయిన అన్నీ చేసేశామని చెబుతూంటారు. కానీ అందుకు తాను భిన్నమని బాబు నిరూపించుకున్నారు. తాజాగా తమ ఏడాది పాలనను విశ్లేషిస్తూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేశారు. ఏడాది పాలనలోనే అన్నీ చేశామని చెప్పడం లేదు.. కానీ ఇంత సంక్షోభంలోనూ ఊహించినదాని కంటే ఎక్కువే చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ఒక్క మాటతో ఆయన మరో మెట్టు ఎక్కేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యకర్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ పదవి తనకు కొత్త కాదు, 4 సార్లు సీఎం అయ్యాను. ప్రతిసారీ సమర్థంగా సుపరిపాలన అందించానని గుర్తు చేశారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం కల్పిస్తామని. అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామని బాబు వెల్లడించారు.