గత కొంతకాలం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ను ఖాతాలో వేసుకుంటున్న నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తాజా యాక్షన్ డ్రామా `తమ్ముడు`. అక్కాతమ్ముడు అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. సప్తమీ గౌడ హీరోయిన్ కాగా.. లయ నితిన్ కు అక్క పాత్రలో నటించారు. వర్ష బొల్లమ్మ, శ్వాసిక తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించారు.
జూలై 4న తమ్ముడు మూవీ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు మూవీకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తమ్ముడు చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ నితిన్ కాదన్న విషయాన్ని ఆయన రివీల్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `వకీల్ సాబ్` వంటి హిట్ తర్వాత వేణు శ్రీరామ్, దిల్ రాజు కలిసి అల్లు అర్జున్ తో `ఐకాన్` అనే మూవీని అనౌన్స్ చేశారు. కానీ అల్లు అర్జున్ పుష్ప తో బిజీగా ఉండడంతో ఐకాన్ ఆలస్యమైంది.
ఈ గ్యాప్ లో తమ్ముడు కథ రాశాడు వేణు శ్రీరామ్. మొదట ఈ చిత్రానికి నాని హీరోగా అనుకున్నారట. ఆయన్ను కలిసి కథ చెప్పడం.. నాని ఓకే చేయడం కూడా జరిగాయి. అయితే నాని ఇతర ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో తమ్ముడు లేట్ అయిపోతుందని భావించి నితిన్ ను హీరోగా తీసుకున్నామని.. అందుకు నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని దిల్ రాజు పేర్కొన్నారు. మరి నాని మిస్ చేసుకున్న తమ్ముడు మూవీ నితిన్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.