మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్ట్స్ లో `విశ్వంభర` ఒకటి కాగా.. `మెగా 157` మరొకటి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విశ్వంభర విషయానికి వస్తే `బింబిసార` ఫేమ్ మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న సోసియో-ఫాంటసీ ఫిల్మ్ ఇది. త్రిష, ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న విశ్వంభర షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది.
అయితే మాస్ ఆడియెన్స్ ను మెప్పించేందుకు మేకర్స్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు. విశ్వంభరకు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అయినప్పటికీ.. ఐటెం సాంగ్ ను స్వరపరిచేందుకు మాత్రం ప్రత్యేకంగా భీమ్స్ సిసిరోలియోని రంగంలోకి దింపారు. ఇక నిన్నమొన్నటి వరకు విశ్వంభరలో స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ దొరకడం లేదని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు చెక్ పెడుతూ చిరుతో చించేసేందుకు కన్నడ పరిశ్రమ నుండి ఓ హాట్ బ్యూటీని మేకర్స్ సెలక్ట్ చేశారట. ఆమెనే నిశ్వికా నాయుడు. 2018లో విడుదలైన `అమ్మ ఐ లవ్ యు(బిచ్చగాడు కన్నడ రీమేక్)` చిత్రంతో హీరోయిన్ గా నిశ్వికా తన నటనా రంగ ప్రవేశం చేసింది. తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్న నిశ్వికా.. ఆ తర్వాత కన్నడలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల `కరటక దమనక` మూవీలోని `హితలక కరిబ్యద మావ మానియా..` సాంగ్‌లో నిశ్వికా డ్యాన్స్ అదరగొట్టింది. ప్రభుదేవకు ధీటుగా పెర్ఫార్మ్ చేయడంతో.. ఆమెకు విశ్వంభరలో ఐటెం సాంగ్ చేసే అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.