వైసీపీ అధినేత జగన్ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇది ఎన్నికల కేసుగా పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఇది ఆలస్యంగా నమోదు చేయడంతో వైసీపీ నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇప్పటికే జగన్‌పై సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్ల పర్యటనలో సంభవించిన కాన్వాయ్ ప్రమాదంపై కేసు పెట్టారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందారు.
అయితే.. అప్పట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీంతో ఎన్నికల సంఘం కొన్ని ఆంక్షలు విధించిం ది. పైగా కోడ్ ప్రకారం కూడా ఎవరూ రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. ఈ విషయాన్ని అప్పట్లోనే జగన్ కు పోలీసులు వివరించారు. అయినా.. ఆయన వారిని కాదని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. రైతుల ను పరా