ఆంధ్ర ప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) ఛైర్మన్ గా డా.రవి వేమూరు మరోసారి నియమితులైన సంగతి తెలిసిందే.
తాజాగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు.
ఏపీ ఎన్నార్టీ వ్యవహారాలు, సేవలు, పెట్టుబడులు/అధ్యక్షులు గా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఇందుకు సంబంధించి ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించింది.
2014-19 మధ్య ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా పనిచేసి విశేష సేవలందించిన రవి వేమూరుకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశమిచ్చారు.
తెనాలికి చెందిన రవి వేమూరు ఎన్నారై టీడీపీ నేతగా చాలా ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు.