TANA మహా సభలు..అమెరికాకు నందిగామ శాసనసభ్యులు/ప్రభుత్వ విప్ ‘సౌమ్య తంగిరాల’!

admin
Published by Admin — June 25, 2025 in Nri
News Image

(TANA) వారు నిర్వహిస్తున్న 24వ ద్వైవార్షిక మహా సభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి.

ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభలను ‘తానా’ నిర్వాహకులు జరుపుతున్నారు.

 

తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఈ వేడుకలు ఈ ఏడాది డెట్రాయిట్‌‌లో జరగనున్నాయి.

ఈ మహాసభలకు ఏపీ, తెలంగాణ నుంచి ఎంతోమంది తెలుగువారు హాజరవుతుంటారు.

ఈ క్రమంలోనే ఏపీ నందిగామ శాసనసభ్యులు/ప్రభుత్వ విప్ ‘సౌమ్య తంగిరాల’ ఈ ఏడాది తానా సభలకు హాజరు కాబోతున్నారు.

నందిగామ శాసనసభ్యులు/ప్రభుత్వ విప్ ‘సౌమ్య తంగిరాల’ బుధవారం రాత్రి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాషింగ్టన్ డిసి బయలుదేరారు.

ఈ క్రమంలోనే తంగిరాల సౌమ్య గారిని ఆమె అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags
24th TANA conference 2025 ap government whip thangirala sowmya attending event
Recent Comments
Leave a Comment

Related News