టీడీపీ ఎమ్మెల్యేల గురించి సర్వత్రా చర్చసాగుతోంది. దీనికి కారణం.. ఆపార్టీనే. ఎందుకంటే.. రాష్ట్రంలో కూటమిపాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ.. తన పార్టీ సభ్యులు ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ.. విచారణ చేస్తోంది. నిఘా సంస్తలతో నివేదికలు తెప్పించుకుంటోంది. అదేసమయంలో ఐవీఆర్ ఎస్ ఫోన్‌కాల్స్ ద్వారా కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది.
ఇలా అనేక రూపాల్లో నాయకుల పనితీరును చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ నాయకుల పనితీరుపై చిత్రమైన నివేదికలు, సమాచారం వచ్చిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు నివాసానికి(ఉండవల్లి), విజయవాడకు మధ్య ఒక్క ప్రకాశం బ్యారేజీ మాత్రమే అడ్డం. అంటే ఒకరకంగా.. చంద్రబాబుకు పెద్ద దూరం కాదు. అంతేకాదు.. ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా.. పదే పదే విజయవాడలో పర్యటిస్తున్నారు కూడా.
ఇంత యాక్టివిటీ జరుగుతున్న విజయవాడలో మాత్రం టీడీపీవెనుకబడి ఉందని నివేదికలు చెబుతున్నా యి. అంతేకాదు.. ఐవీఆర్ ఎస్ సర్వేలోనూ ఇదే విషయాలు వెలుగు చూసినట్టు చెబుతున్నారు. ప్రధానం గా నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం.. నాయకులు ఎవరికి వారు గా ఉండడం వంటివి టీడీపీ ఎమ్మెల్యేల కు సంబంధించి ఇచ్చిన నివేదికలు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను బట్టి నాయకులు అంచనా వేశారు.
అంతేకాదు.. విజయవాడలో రెండు నియోజకవర్గాలు టీడీపీ విజయందక్కించుకుంది. ఒక్కచోట మాత్రమే బీజేపీ విజయం దక్కించుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అయినా.. యాక్టివిటీ జరుగుతుందని అను కున్నారు. కానీ, పైపై మెరుగులకే నాయకులు ప్రాధాన్యంఇస్తున్నారన్నది ఐవీఆర్ ఎస్ సర్వేలో స్పష్టమైందని చెబుతున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గం శివారు ప్రాంతాల్లో డెవలప్ మెంటు లేకపోవడం.. ప్రజల మధ్యకు నాయకులు రాకపోవడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. సో.. దీనిని బట్టి చంద్రబాబు ఎన్ని చెప్పినా.. ఏం చేసినా.. ఎమ్మెల్యేల పనితీరులో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదన్నది వాస్తవం అంటున్నారు నాయకులు.