వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా పల్నాడు పర్యటన సందర్భంగా.. ఆయన వాహనం కింద పడి వైసీపీ అభిమాని సింగయ్య మరణించినట్లుగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి తాజాగా ఒక కీలక అంశం బయటకు వచ్చింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విచారణ జరిపి.. సింగయ్య మరణానికి దారి తీసిన అంశాలపై ఫోరెన్సిక్ నిపుణులు ఒక రిపోర్టు ఇచ్చారు. ఇందులో.. సింగయ్య చావుకు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన వాహనమేనని తేల్చారు,
ఈ అంశాన్ని వైసీపీ కార్యకర్తల నుంచి సేకరించిన వీడియోలతోనే ఈ అంశాన్ని తాము గుర్తించినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడిపోయి నలిగిపోయినట్లుగా చూపిస్తున్న వీడియోలు మార్ఫింగ్ కాదని.. ఒరిజినలేనని స్పష్టం చేస్తున్నారు. జగన్ వాహనం కింద పడిపోయి నలిగిపోయిన సింగయ్యను.. వైసీపీ కార్యకర్తలు పక్కకు తీసి పడేయటంతో.. ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియోల్ని ఘటనాస్థలంలో డ్రోన్.. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. ర్యాలీని షూట్ చేసిన వౌసీపీ కార్యకర్తల నుంచి అన్ని వీడియోల్ని సేకరించిన పోలీసులు.. ఆ రోజు అసలేం జరిగిందన్న విషయాన్ని గుర్తించటమే కాదు.. దానికి సంబంధించిన ఆధారాల్ని సేకరించినట్లుగా చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరు వీడియోలు మొత్తం ఒరిజినల్ గా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సింగయ్య మరణంపై జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో.. చెప్పిన అంశాలకు సంబంధించిన వివరాలు తప్పు కావటం..ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీవర్గాలు చేస్తున్న ప్రచారంపైనా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. పోలీసుల్ని తప్పు దారి పట్టేలా వివరాల్ని అందజేసిన వారెవరు? అన్న అంశంపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.