గత శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం `కన్నప్ప`. ఇందులో మంచు విష్ణు టైటిల్ పాత్రను పోషించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమైన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మంచు విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తో కన్నప్ప బాక్సాఫీస్ రన్‌ను ప్రారంభించింది.
అయితే వీకెండ్ వరకు సూపర్ గా పెర్ఫార్మ్ చేసిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లో వీక్ అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వరకు రూ. 3 కోట్లకు పైగా వాసూళ్లను అందుకున్న కన్నప్ప.. సోమవారం టెస్ట్‌లో ఫెయిల్ అయింది. వర్కింగ్ డే కావడంతో రూ. కోటి మాత్రమే కలెక్ట్ చేసింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. బ్రేక్ ఇవెన్ టార్గెట్ రూ. 81 కోట్లు.
కొండంత టార్గెట్ తో బరిలోకి దిగిన కన్నప్పకు.. నాలుగు రోజుల్లో వచ్చింది గోరంతే. సోమవారం ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో ఈ చిత్రం రూ. 14.07 కోట్ల షేర్, రూ. 24.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 20.17 కోట్ల షేర్, రూ. 38.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కన్నప్ప ఇంకా రూ. 60.83 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూల్ చేయాల్సి ఉంది. మరి ఫుల్ రన్‌లో ఈ టార్గెట్‌ను కన్నప్ప రీచ్ అయ్యేనే.. మంచు విష్ణు ఖాతాలో క్లీన్ హిట్ పడేనా.. అన్నది చూడాలి.