ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం భావించిన బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం.. కొంత వెనుకబడింది. కేంద్రంలోని పర్యావరణ విభాగం.. ఈ ప్రాజెక్టుకు కొన్ని సమస్యలు లేవనెత్తుతూ.. ప్రతిపాదనను వెనక్కి తిప్పి పంపింది. అయితే.. దీనిపై సదరు ఏపీ ప్రభుత్వం సరైన వాదనలు వినిపిస్తే.. నేడు కాకపోయినా.. మున్ముందు అయినా.. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి అవుతుంది. దీనిలో ఎలాంటి సందేహాలు లేవన్నది జల వనరుల విభాగం నిపుణులు చెబుతున్న మాట.
ఇదిలావుంటే.. బనక చర్ల వ్యవహారంపై ఆది నుంచి కూడా సవాళ్లు-ప్రతిసవాళ్లు రువ్వుకుంటున్న తెలంగా ణ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ ఎస్‌ల మధ్య తాజా పరిణామం కూడా ఆసక్తిగా మారింది. బనకచర్లపై కేంద్రం తాజాగా వ్యవహరించిన తీరునకు తాము కారణమంటే.. తాము కారణమని బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. తాము కేంద్రానికి లేఖలు రాయడం వల్ల.. పదే పదే విజ్ఞప్తులు చేసినందుకే.. కేంద్రం బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేసిందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.
కానీ.. దీనిని బీఆర్ ఎస్ విభేదిస్తోంది. తాము.. ముందుగా ఈ ప్రాజెక్టుపై స్పందించామని.. కాబట్టే.. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వీడిందని చెబుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన.. హరీష్ రావు కూడా.. ఇదే విష యాన్ని చెప్పుకొచ్చారు. ``ముందుగా గురు దక్షిణ కింద బనకచర్ల ప్రాజెక్టును ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ, మేం పట్టుబట్టిన తర్వాత.. కేంద్రంతో చర్చిస్తున్నామని.. కబుర్లు చెబుతున్నారు. ఇదంతా బీఆర్ ఎస్ చేయడం వల్లే జరిగింది.`` అని ఆయన క్రెడిట్ సొంతం చేసుకునే ప్రయత్నం చేశా రు.
ఇక, బీఆర్ ఎస్ నాయకురాలు కవిత కూడా.. బనకచర్ల కు బ్రేక్ పడిన వ్యవహారంలో క్రెడిట్ తమకే దక్కు తుందన్నారు. తమ పోరాటాల కారణంగానే ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. ఇక వీరిని పక్కన పెడితే.. సీఎం రేవంత్ రెడ్డి మరోఅడుగు ముందుకు వేసి.. కేసీఆర్-జగన్‌తో లాలూచీ పడి వ్యవహరించారని.. ఈ క్రమంలో అప్పట్లోనే బనకచర్లకు బీజం పడిందని.. కాబట్టి గోదావరి జలాలను.. ఏపీకి కట్టబెట్టే ప్రయత్నం చేసింది కేసీఆరే.. అని ఆయన నిప్పులు చెరిగారు. మొత్తంగా ఇరు పక్షాలు కూడా.. బనకచర్ల క్రెడిట్ కోసం పొలిటికల్ కొట్లాటకు దిగడం గమనార్హం.