టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. అయిన కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం పరుగులు పెడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం గోపీచంద్ `ఘాజి`, `అంతరిక్షం` ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ లో 33వ ప్రాజెక్ట్ ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
గోపీచంద్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. 7వ శతాబ్దంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా గోపీచంద్ ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడు. ఒక యోధుడిగా అలరించబోతున్నాడు. అందుకు తగ్గట్లే ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ మూవీకి `శూల` అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖారారు చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆల్మోస్ట్ అదే టైటిల్ కన్ఫార్మ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఓ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యం ఉంటుందట. ఆ ప్రదేశం పేరు శూల అని.. కథకు యాప్ట్ గా ఉండటంతో అదే పేరును టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఏదేమైనా టైటిల్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ అదిరిందని చాలా మంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.