పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `హరిహర వీరమల్లు` ఒకటి. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పిరియాడిక్ ఫిల్మ్ తొలి భాగం జూలై 24న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా మేకర్స్ `హరిహర వీరమల్లు` ట్రైలర్ ను లాంచ్ చేశారు. 2:56 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
`హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం..` అంటూ తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. పోరాట సన్నివేశాలు, విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ దేనికదే హైలెట్ గా నిలిచింది. పంచమి గా నిధి అగర్వాల్ అలరించింది.
వీరమల్లుగా పవన్ వీరతాండవం చేశాడు. `ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూసుంటారు.. ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులిని చూస్తారు`, `నేను రావాలని చాలామంది దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు` అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ అలరిస్తున్నారు. కిరవాణి అందించిన బీజీఎమ్ ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూసి `వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయాయి. మైండ్ బ్లోయింగ్ వర్మ.. వేరే లెవెల్, ఇండస్ట్రీ హిట్ వర్మ.. బాక్సాఫీస్ బద్దలు` అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వీరమల్లు సినిమాను ఏ.ఎం. రత్న నిర్మిస్తున్నారు. బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.