హిట్ కోసం చాలా కాలం నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్.. నేడు `తమ్ముడు` మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ కాగా.. సీనియర్ నటి లయ, మలయాళ భామ స్వస్తిక, సౌరబ్ సచ్‌దేవ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
మంచి అంచనాల నడుమ నేడు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన తమ్ముడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ లభిస్తుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ కథ. మొత్తం ఫారెస్ట్.. అక్కడ ఉండే గ్రామాలు చుట్టూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కథను అల్లుకున్నాడు. ఆ గ్రామాలపై పెద్ద వాళ్ళ కన్ను పడడం, వాటిని లాక్కునే ప్రయత్నం చేయడం, వారికి హీరో అండగా నిలబడడమే తమ్ముడు యొక్క మెయిన్ స్టోరీ.
అయితే కొందరు సినిమా బాగుందని ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని.. ఎంచుకున్న సబ్జెక్టును డైరెక్టర్ వేణు శ్రీరామ్ చక్కగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ప్రొడెక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయంటున్నారు. లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని.. విలన్ పాత్రధారికి కూడా భారీ ఎలివేషన్స్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ సూపర్ గా ఉందని చెప్తున్నారు. అయితే మరోవైపు తమ్ముడు చిత్రానికి నెగటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి.
ఫస్టాఫ్‌లో స్క్రీన్ ప్లే ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదని.. ఎమోషనల్ సీన్లు కూడా కనెక్ట్ కాలేదని ఆడియన్స్ చెబుతున్నారు. నితిన్ యాక్టింగ్, విలన్ క్యారెక్టరైజేషన్, సెకండాఫ్, డీసెంట్ బ్యాక్ గ్రౌండ్, వీఎఫ్ఎక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా.. బలహీనమైన కథనం, బలహీనమైన భావోద్వేగాలు, పాటలు, డ్రాగ్డ్ సీన్స్, స్టోరీ ఊహకు తగ్గట్లు సాగడం మైనస్‌లుగా చెబుతున్నారు. ఓవరాల్‌గా తమ్ముడు యావరేజ్ మూవీని కొందరు చెబుతున్నారు. నితిన్ కు ఖాతాలో మరో ఫ్లాప్ పడిందని కొందరు అభిప్రాయపడగా.. మరికొందరు తమ్ముడు నితిన్ కంబ్యాక్ చిత్రమని అంటున్నారు.