కూటమిని ముందుండి నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు రెండో సంవత్సరంలో సవాళ్లు ఎదురవుతున్నా యి. ఒకరిద్దరు నాయకులు రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తున్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాలను సేకరించారని.. ఇప్పుడు మరో 44 వేల ఎకరాలను తీసుకుంటున్నారని.. దీనివల్ల.. ప్రయోజనం లేదని.. చెబుతున్నారు. రాజధానికి భూములు ఇవ్వొద్దని.. చెబుతున్నారు.
అంతేకాదు.. వ్యవసాయ సంఘాలను కూడా ఏకం చేసి రైతుల మైండ్ సెట్‌ను మార్చే ప్రయత్నం చేస్తు న్నారు. నిజానికి మరోవైపు ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి చంద్రబాబు చెక్ పెడుతున్నా.. ఇలా.. గతంలో తన దగ్గరే మంత్రులుగా చక్రాలు తిప్పిన వారు చేస్తున్న యాంటీ ప్రచారాన్ని చంద్రబాబు అడ్డుకోలేక పోతున్నారు. ఇక, మరో కీలక విషయం.. పోలవరం, బనకచర్ల. ఈ రెండు ప్రాజెక్టులను కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
వచ్చే 2027 నాటికి పోలవరం, 2028 నాటికి బనకచర్ల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం అంటే అందరికీ తెలిసిందే. ఇప్పటికే నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. ఇక, కొత్త ప్రాజెక్టు బనకచ ర్ల. దీనికి డీపీఆర్ మాత్రమే ఇప్పటి వరకు రెడీ అయింది. దీనికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకు నేందుకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇబ్బందులు వచ్చాయి.
వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. సో.. అటు అమరావతి, ఇటు పోలవరం, బనకచర్ల విషయాల్లో చంద్రబాబుకు ఇంటా -బయటా కూడా.. సెగ తగలడం ఖాయమని తెలుస్తోంది. ఇవన్నీ ఒక విధానం అయితే.. మరోవైపు.. రాజకీయంగా దూకుడు పెంచడం కూడా కీలకంగా మారింది. క్షేత్రస్థాయిలో అలకలు, బుజ్జగింపులు.. వంటివి పెరుగుతున్నాయి. వీటికితోడు.. ప్రజల్లో వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారం కూడా దీనికి కలిసి వస్తోంది. ఇలా. మొత్తంగా రెండో సంవత్సరం.. చంద్రబాబుకు పెద్ద సవాలేనని అంటున్నారు పరిశీలకులు.