దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే నయనతార పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ షాకింగ్ వార్త గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భర్త విఘ్నేష్ శివన్ తో నయనతార విడాకులు తీసుకోబోతుంది అన్నదే ఆ వార్త సారాంశం. 2022లో తమిళ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ నయనతార ప్రేమ వివాహం చేసుకుంది. అదే ఏడాది సరోగసి ద్వారా ఈ దంపతులు ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.
ఆ తర్వాత వీరి లైఫ్ ఎంత సాఫీగా, సంతోషకరంగా సాగుతుందో నయనతార ఇన్స్టా అకౌంట్ ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏమైందో ఏమో రీసెంట్ గా నయన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. `తెలివి తక్కువ ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడం పెద్ద తప్పు. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. నన్ను వదిలేయండి, మీ కారణంగా నేను ఇప్పటికే తగినంత ఎదుర్కొన్నాను` అని నయన్ పోస్ట్ పెట్టింది.
కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్ ను తొలగించినప్పటికీ.. అప్పటికే నష్టం జరిగిపోయింది. నయనతార పోస్ట్ కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు వైరల్ గా మారడంతో.. ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే మరోవైపు ఆ పోస్ట్ నయనతార పెట్టిందని కాదని.. అదొక నకిలీ పోస్ట్ అని నమ్ముతున్నారు. ఇటువంటి పరిణామాల నడుమ విడాకుల వార్తలపై నయనతార స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా భర్త విఘ్నేష్ మరియు పిల్లలతో కలిసి నయనతార తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పళని స్వామి ఆలయంలో ప్రత్యక్షం అయింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై కుటుంబం మొత్తం సాష్టాంగ నమస్కారాలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో బయటకు రావడం, విఘ్నేష్ - నయరతార ఎంతో అన్యోన్యంగా కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లైంది.