దాదాపు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇటీవల విడుదల అయ్యారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీని చూస్తే ఎవ్వరైనా కూడా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. ఎందుకంటే వంశీ అంతలా మారిపోయారు. ఇలాంటి టైంలో సింపతీ చూపించడం పోయి వంశీపై సెటైర్లు పేల్చారు కొడాలి నాని. ఏంటి చిక్కిపోయావ్.. డైటింగ్ గా అంటూ నెక్స్ట్ లెవల్ కామెడీ చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరికీ తోడు పేర్ని నాని.. ఈ ముగ్గురు చుట్టూనే మీడియా తిరిగేది.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ ముగ్గురు నేతలు ఓ రేంజ్ లో చెలరేగిపోయారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పెద్దలను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశారు. వినడానికి ,రాయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే భాషలో ముగ్గురూ రెచ్చిపోయారు. అయితే గత తేడాది కూటమి అధికారంలోకి రావడంతో పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రభుత్వానికి మెయిన్ టార్గెట్ అయ్యారు. కాకపోతే నేరుగా టార్గెట్ చేయకుండా.. వారు పాల్పడిన అవకతవలను బయటకు లాగుతూ చట్టపరంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వంశీ జైలుకెళ్ళి బయటపడ్డాడు.
పేర్ని నాని, కొడాలి నాని పై కూడా కేసులను నమోదు అయ్యాయి. అయితే వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక జైలు నుంచి విడుదలైన వంశీని తాజాగా కొడాలి నాని, పేర్ని నాని పరామర్శించారు. ఈ సమయంలో వీరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వంశీ పక్కనే ఉన్న కూడా చూసి చూడనట్టు వ్యవహరించిన పేర్ని నాని.. వంశీ ఎక్కడ? అని ప్రశ్నించి జోకులు పేల్చారు. గుర్తుపట్టనట్లుగా ఆయనతో మాట్లాడి నవ్వులు పూయించారు. మరోవైపు కొడాలి నాని సైతం వంశీని చూడగానే ఏంటి చిక్కిపోయావ్.. డైటింగ్‌గా అంటూ కామెడీ చేశారు. జైలు జీవితం తర్వాత మూడీగా ఉన్న వంశీలో ఉత్సాహం నింపేందుకు నానిలిద్దరూ బాగానే ప్రయత్నించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ఈ ముగ్గురు కలవడం ఇదే తొలిసారి. దీంతో వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.