కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినిధులను అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణ రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు, ఆ వ్యవహారం పై సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నివేదికను అందించారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ప్రిన్సిపాల్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన అధికారులు అతడితో పాటు మరో ముగ్గురు ల్యాబ్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారించారు. దీంతో, ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.