`కట్టుతప్పుతున్నారు`.. అని పేర్కొంటూ జనసేన నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరు ఇంచార్జ్ టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెం డ్ చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్ల కిందట ఇదే జిల్లాకు చెందిన మరో కీలక నాయకుడిని కూ డా సస్పెండ్ చేశారు. అయితే.. వీరి సస్పెన్షన్ ద్వారా.. పార్టీ ఇస్తున్న సంకేతాలేంటి? అనేది ఆసక్తిగా మా రింది. తాజా పరిణామాల ద్వారా.. పవన్ చెప్పకనే చెబుతున్న మాటేంటనేది కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది.
అసలు ఏం జరిగింది?
కూటమి పార్టీల నాయకుల మధ్య నామినేటెడ్ పదవుల విషయంలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతు న్నాయి. జనసేన-బీజేపీ రెండు పార్టీల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. అయితే.. కొందరు మౌనంగా ఉన్నారు. మరికొందరు ఈ విషయాన్ని వివాదంగా మారుస్తున్నారు. ఇలా వివాదాలు సృష్టిస్తున్న వారిపైనే జనసేన ఘాటుగా రియాక్ట్ అవుతోంది. తాజాగా రామారావు సస్పెన్షన్ వెనుక కూడా.. ఇలాంటి ఘటనే ఉంది . పొత్తులో ఉన్న టీడీపీని తప్పుబడుతూ..రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
కొవ్వూరులో జనసేన నాయకులకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని రామారావు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా సొసైటీలు, మార్కెట్ కమిటీల ఏర్పాటులో జనసేన నాయకులను, కార్యకర్తలను పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇది స్థానికంగా జెండా మోస్తున్న వారికి బాధగా ఉందన్న రామారావు.. పొత్తు ధర్మాన్ని జనసేన నిబద్ధతతో పాటిస్తుంటే.. టీడీపీ నుంచి ఆ తరహా పరిస్థితి కనిపిం చడం లేదన్నారు. కూటమి పొత్తు స్ఫూర్తిని గౌరవించే విధంగా సహకారం లేకుండా పోయిందన్నారు.
ఈ లేఖపైనే పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బహిరంగ పరచడంతోపాటు స్థాయిని మించి వ్యాఖ్యానించడంతొ రామారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే.. ఈ ప్రక్రియ ద్వారా.. జనసేన ఘాటుగా.. గట్టిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే.. కూటమిలో కలిసి ఉండాలే తప్ప.. కుమ్ములాటకు దారితీసేలా వ్యవహరించవద్దనే. ఈ క్రమంలోనే నాయకులు ఎంతటి వారైనా.. పవన్ కల్యాణ్.. కఠినంగానే వ్యవహరిస్తున్నారు.