జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా, పలు శాఖలకు మంత్రిగా కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను ఏపీకి సీఎంగా చూడాలని అభిమానులు ఎంతో ఆత్రంగా ఉన్నారు. కానీ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఉన్నాయి. ఈ పొత్తు కొనసాగితే ఇంకొన్నేళ్ల పాటు పవన్ కు సీఎం పదవి దక్కే ఛాన్స్ లేదు. అదంతా పక్కన పెడితే.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడో ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచార్జ్ సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈనెల 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించబోతున్నారు. పెట్టుబడుల ఆకర్షణే ఈ పర్యటన లక్ష్యం. సింగపూర్ కు చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజే భరత్, నారాయణ కూడా వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆ నాలుగు రోజుల పాటు పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారట.
పవన్ కళ్యాణ్ కు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బాబు భావిస్తున్నారట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో విసృతంగా వైరల్ అవుతోంది. కానీ, ఇంతవరకు ఈ అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ముఖ్యమంత్రి అనారోగ్యం, సెలవు, లేదా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తాత్కాలికంగా మరొక మంత్రి లేదా అధికారికి ఇంఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారు. గతంలో తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినప్పుడు తనకు నమ్మినబంటుగా ఉన్న పనీర్ సెల్వంను ఇంఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ రిపీటైతే జనసైనికులు, పవన్ కళ్యాణ్ విరాభినుల ఆనందానికి అవధులు ఉండవు.