మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో `విశ్వంభర` ఒకటి. `బింబిసార` ఫేమ్ మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సోసియో-ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష మెయిన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఆశిక రంగనాథ్, సురభి, కునాల్ కపూర్, ఇషా చావ్లా కీలక పాత్రలను పోషిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణ సంగీతం అందిస్తున్నారు.
చిత్రీకరణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. గ్రాఫిక్స్ వర్క్ పనులు జరుగుతున్నాయి. అంచనాలు భారీగా ఉండటంతో దాదాపు తొమ్మిది నెలల నుంచి ఎంతో కేర్ తీసుకుంటూ గ్రాఫిక్స్ వర్క్ ను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇకపోతే విశ్వంభర స్టోరీ లైన్ ఏంటి? అనేది ఇంతవరకు సినీ ప్రియులు అంచనా వేయలేకపోయారు. అయితే విశ్వంభర స్టోరీ లైన్‌ను డైరెక్టర్ వసిష్ఠ స్వయంగా రివీల్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వసిష్ఠ మాట్లాడుతూ.. `మనకు తెలిసినవి 14 లోకాలు. పైన ఏడో లోకాలు, కింద ఏడు లోకాలు. 14 లోకాలకు బేస్ గా మరో లోకాన్ని క్రియేట్ చేశాం. దానికి విశ్వంభర అని పేరు పెట్టాం. ఆ లోకంలో ఉన్న హీరోయిన్ ను 14 లోకాలను దాటి వెళ్లి హీరో ఎలా కలిశాడు? ఆమెను తిరిగి భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే మెయిన్ స్టోరీ` అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ స్టోరీ కొంచెం అటు ఇటుగా చిరంజీవి యొక్క `జగదేకవీరుడు అతిలోకసుందరి` సినిమాను గుర్తు చేస్తోంది. అందులో హీరోయిన్ స్వర్గలోక నుంచి భూలోకానికి వస్తుంది. ఇక్కడ హీరో భూలోకం నుంచి విశ్వంభర అనే లోకానికి వెళ్తాడు. ఇదే విషయాన్ని డైరెక్టర్ వద్ద ప్రస్తావించగా.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు, విశ్వంభరకు సంబంధం లేదని ఆయన తేల్చేశారు. రామాయణంలో సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోతే రాముడు ఎలా యుద్ధం చేస్తాడో.. విశ్వంభర కూడా అంతే అని.. త్రిష చుట్టూనే స్టోరీ మొత్తం సాగుతుందని వసిష్ఠ ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో ఎక్కడో కొడుతుంది శ్రీనా అంటూ నెటిజన్లు విశ్వంభర కథపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రొటీన్ స్టోరీతోనే వసిష్ఠ ప్రయోగం చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.