వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ‘బసవతారకం ట్రస్ట్’కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటి మాట ఆధారంగా ఒక వ్యక్తిని సాక్షిగా గుర్తించడం చెల్లదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.