మాజీ వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ నేత రఘురామకృష్ణరాజుపై జగన్ సర్కార్ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వైనం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కస్టోడియల్ టార్చర్ సమయంలో ఆనాడు తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది. అంతేకాదు, విచారణకు సహకరించకుంటే మధ్యంతర రక్షణ రద్దవుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.