‘సిలికానాంధ్ర కమిటీ 2025-2027’లో తొలిసారిగా సభ్యులంతా మహిళలే ఉండడం చరిత్రాత్మకం. సిలికానాంధ్రా చరిత్రలో తొలిసారిగా మహిళా సభ్యులు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారు. సత్య ప్రియ తనుగుల నాయకత్వంలో ఏర్పడిన ఈ కమిటీ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.
సిలికానాంధ్ర కమిటీ 2025-2027:
ప్రెసిడెంట్: సత్యప్రియ తనుగుల
వైస్ ప్రెసిడెంట్ శిరీష కాలేరు
ట్రెజరర్: మాధవి కడియాల
సెక్రటరీ: రమా సరిపల్లె
జాయింట్ సెక్రటరీ: ఉషా మాడభూషి
వీరంతా అంకితభావం, నాయకత్వ లక్షణాలతో పాటు సిలికానాంధ్రలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారంతా కలిసి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్జాతీయ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులు సమర్ధవంతంగా నిర్వహించారు. వారి దృష్టి, అభిరుచి, సామర్థ్యం ప్రశంసనీయం. సిలికానాంంధ్రను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మనమందరం వారిని హృదయపూర్వకంగా అభినందిద్దాం భవిష్యత్తులో వారు చేపట్టబోయే కార్యక్రమాలకు మద్దతునిద్దాం. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయల స్ఫూర్తిని బలోపేతం చేద్దాం.
- దిలీప్ కొండిపర్తి