అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా వినాయక చవితి సంబరాలు ఘనంగా ముగిశాయి. కాలిఫోర్నియాలోని శాన్ రామోన్ లో జరిగిన ఈ వేడుకలో దాదాపు 20 వేల మంది పాల్గొన్నారు. బే ఏరియాలోనే అత్యంత భారీ స్థాయిలో అంగరంగవైభవంగా జరిగిన ఈ వినాయక చవితి వేడుకలలో భక్తులు, స్థానికులు, అధికారులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. నమస్తే బే ఏరియా, బాలీ 92.3 ఎఫ్ఎమ్ లు సంయుక్తంగా ఈ వేడుకలను బిషప్ రాంచ్ సిటీ సెంటర్ వేదికగా ఘనంగా నిర్వహించాయి. సంగీతం, సంస్కృతీసంప్రదాయాలు, రుచికరమైన విందు, భక్తి, సామాజిక స్పృహ కలగలిపిన ఈ వేడుకలు నెవర్ బిఫోర్...ఎవ్వర్ ఆఫ్టర్ అన్నరీతిలో జరిగాయి.
మండుటెండను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో బే ఏరియా మార్మోగింది. 100 మందికి పైగా డప్పులతో, సంప్రదాయ నృత్యాలతో, హారతులతో అలరించారు. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సంస్కృతీ సంప్రదాయాలు, ఏకత్వంలకు సంబంధించిన అరుదైన ఘట్టం అని నిర్వాహకులలో ఒకరు అన్నారు. ఈ వేడుకలకు వేలాదిమంది తరలివచ్చారని, భావితరాల వారికి సంస్కృతీ సంప్రదాయాల ప్రాధాన్యత గురించి చాటి చెప్పారని అన్నారు.
బే ఏరియాలోని ఎన్నికైన అధికారులు, ప్రముఖులు మరియు కమ్యూనిటీ నాయకులు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలమెడ కౌంటీ సూపర్‌వైజర్ డేవిడ్ హౌబర్ట్, శాన్ రామన్ మేయర్ మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, డబ్లిన్ మేయర్ షెర్రీ హు, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటానో, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వెరోస్, మిల్పిటాస్ ప్లానింగ్ కమిషనర్ దీపక్ అవస్తీ, ఎస్ఆర్వీయూఎస్ డీ బోర్డు సభ్యురాలు సుసన్నా ఆర్డ్‌వే, శాన్ రామన్ కౌన్సిల్ సభ్యుడు రిచర్డ్ అడ్లెర్, సిలికాన్ వ్యాలీ ఏషియన్ అసోసియేషన్ నుండి కాథీ జు తదితరులు పాల్గొన్నారు. బే ఏరియా గణేష్ ఉత్సవాలు కేవలం ఆరాధనకు సంబంధించినవి కాదని, అంతకంటే ఎక్కువ అని వారు అన్నారు. ఇది ఐక్యత, సామరస్యం, సంస్కృతిలను ప్రతిబింబించే వేడుక అని చెప్పారు.
ఈ వేడుకల హైలైట్స్:
100% మట్టితో తయారు చేసిన పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు, పర్యావరణ అనుకూల మెటీరియల్ తో చేసిన అలంకరణ
వేదికపై 200 మందికిపైగా కళాకారుల శాస్త్రీయ నృత్యం, భక్తి సంగీతం, నాటకం, సాంస్కృతిక ప్రదర్శనలు
గంటకు ఒకసారి ఆరతులు, భజనలు...రోజంతా వందలాది కుటుంబాలు భక్తిబావంతో ఉన్నాయి
భారీ ఊరేగింపుతో వినాయక విగ్రహ నిమజ్జనం... 100 మందికి పైగా డ్రమ్మర్లు ధోల్-తాషా మోగిస్తూ వినాయకుడికి ఘనంగా వీడుకోలు పలికారు
విందు భోజనం, బజార్ - రకరకాల రుచికరమైన భారతీయ వంటకాలతో విందు భోజనం, నగలు, దుస్తులు, కళాకృతులతో కూడిన 100కుపైగా దుకాణాలు
ఈ ఈవెంట్ ఘన విజయం సాధించడానికి మద్దతుగా నిలిచిన స్పాన్సర్లు:
గ్రాండ్ స్పాన్సర్: సంజీవ్ గుప్తా CPA
పవర్డ్ బై : రియల్టర్ నాగరాజ్ అన్నీయా
ఎకో పార్టనర్: ఎర్త్ క్లీన్స్
మార్కెట్ స్పాన్సర్: విజేత సూపర్ మార్కెట్
గోల్డ్ స్పాన్సర్స్: రేణు-బయోమ్, శ్రీ శివ సాయి
సిల్వర్ స్పాన్సర్లు: రియల్టర్ శిఖా కపూర్, ఇన్‌స్టా సర్వీస్, మైపర్సు, దీక్ష, టూ మెయిడ్స్
లడ్డూ స్పాన్సర్: అమృత విలాస్
ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించిన మీడియా పార్ట్ నర్స్ కు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటకంకాలు లేకుండా సాఫీగా, సజావుగా, సురక్షితంగా ఈ వేడుకలు సాగేందుకు సహకరించిన సిటీ ఆఫ్ శాన్ రామోన్, బిషప్ రాంచ్, సివిక్ అథారిటీస్, వాలంటీర్లు, ప్రతి ఒక్క భక్తుడికి నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలు కేవలం వినాయక చవితి వేడుకలే కావు...బే ఏరియాలోని విభిన్న సంస్కృతులకు చెందిన వేలాది మంది హాజరైన భారీ వేడుకలు. సోదరభావం, స్నేహభావంతో నిండిన ఈ వేడుకలు అందరిలోనూ సంతోషాన్ని నింపాయి. నార్త్ కాలిఫోర్నియాలోని అతి పెద్ద వేడుకగా ఈ వేడుకలు నిలిచాయి.