సుగాలి ప్రీతి కేసు 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు అటకెక్కింది. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కేసు గురించి పదే పదే ప్రస్తావించం, ఆ తర్వాత సుగాలి ప్రీతి ఇంటికి వెళ్లడం వంటి పరిణామాలతో ఈ కేసులో కాస్త కదలిక వచ్చింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని పవన్ హామీనిచ్చారు. ఆ మాట ప్రకారమే తాజాగా ఆ కేసులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం సీబీఐకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ కేసును పట్టించుకోలేదని ప్రీతి తల్లి ఆరోపించారు. అయితే, తాను ఈ కేసు గురించి మాట్లాడిన తర్వాతే వైసీపీ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పవన్ గుర్తు చేశారు.