సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.నీకు, నీ అయ్యకు మగతనం లేకనే పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారా అని దయాకర్ ప్రశ్నించారు.
ఆ కారణంతోనే వారితో రాజీనామా చేయించలేదా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి మగాడు, దమ్మున్నోడు కాబట్టే తొడ కొట్టి మిమ్మల్ని ఓడించి ఫామ్‌హౌస్ కు పంపించాడని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని, సుద్దపూస మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు పట్టించుకోరని అన్నారు. వందల ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్లు కేటీఆర్ గద్వాలకు వెళ్లాడని చురకలంటించారు.