తిరుపతిలో రెండు రోజులపాటు జరుగుతున్న మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సాధికారత సభ ఆదివా రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. అసెంబ్లీ స్పీకర్.. చింతకాయల అయ్యన్న పాత్రుడు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ.. మహిళల సాధికారతకు.. దివంగత ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ హయాంలోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. మహిళలకు ఆస్తిలోనూ హ క్కు కల్పించారని.. తెలిపారు. ఆ తర్వాత.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా మహిళల సెంట్రిక్ గా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పథకాల నుంచి పదవుల వరకు అనేక మంది మహిళ లను చంద్రబాబు ప్రోత్సహించారని తెలిపారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కూడా మహిళలకు అనేక కార్య క్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
బీహార్‌లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు. తద్వారా మహిళలకు స్థానిక పాలనలో పాలుపంచుకునే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందన్నారు. సైబరాబాద్ సహా.. ఏపీని కూడా ఆయన ఐటీ రంగంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణనను ఏపీలో చేపట్టారని, ఇది రికార్డని వ్యాఖ్యానించారు. తిరుపతిలోని శ్రీసిటీలో సగానికి పైగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.