ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) మరియు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో యూరప్‌లోని పలు నగరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈ కల్యాణాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే బేసింగ్స్టోక్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ బేసింగ్స్టోక్ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సుమారు 1000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించారు.
తిరుమల పూజారులు, వేద పండితులతో ఈ కల్యాణం సంప్రదాయబద్ధంగా జరిగింది. టీటీడీ లడ్డూ ప్రసాదం, తీర్థం, అకింతాలు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తెలుగు సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మికతతో నిండిన ఒక అపూర్వ అనుభూతిని ఎన్నారై భక్తులకు అందించింది. యూరప్ కార్యక్రమాలకు ప్రధాన సమన్వయకర్తగా డాక్టర్ చలసాని కిషోర్ బాబు బాధ్యతలు చేపట్టారు.
యూకే, ఐర్లాండ్ ప్రాంతాల సమన్వయకర్తగా కాట్రగడ్డ కృష్ణప్రసాద్, విజయ్ కుమార్ అడుసుమిల్లి, సురేష్ కోరం, శ్రీను వావిలాల, గోగినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. శెంగెన్ ప్రాంత సమన్వయకర్తలుగా నరేశ్ కోనేరు, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి బాధ్యతలు స్వీకరించారు.