ఏపీ 16వ అసెంబ్లీ 4వ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో సభను స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొదలుబెట్టారు. ఈ సమావేశాలు 7 లేదా 10 రోజుల పాటు జరిగే అవకాశముంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత జరగబోయే బీఏసీ సమావే:లో సభ ఎన్ని రోజులు నిర్వహించాలని అన్న విషయంపై అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ సమావేశాల్లో 6 ఆర్డినెన్స్ ల స్థానంలో బిల్లులలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
పంచాయతీ రాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ వంటి పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపే చాన్స్ ఉంది. గతంలో మాదిరిగానే వైసీపీ సభ్యులు శాసన సభకు డుమ్మా కొట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి సభకు వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కొద్దో గొప్పో బలం ఉన్న మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.