ఎటువంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన శర్వానంద్, మొదట సహాయ పాత్రలతో ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా సత్తా చాటారు. తనదైన సహజ నటన, విభిన్నమైన కథల ఎంపికతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచారు. ఇకపోతే ఆయన వ్యక్తిగత జీవితం సింపుల్‌గా, లో ప్రొఫైల్‌గా ఉంటుంది. కుటుంబానికి దగ్గరగా ఉండే హీరోల్లో శర్వా ఒకరు.
అయితే తాజాగా శర్వానంద్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఓ షాకింగ్ గాసిప్ టాలీవుడ్ లో సర్క్యూలేట్ అవుతుంది. విషయం ఏంటంటే.. శర్వానంద్ దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయట. ప్రస్తుతం భార్యకు శర్వా దూరంగా ఉంటున్నారు అనేది ఆ వార్త సారాంశం. 2023లో రక్షితా రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని శర్వానంద్ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
2024 మార్చిలో శర్వానంద్ దంపతులకు ఒక పాప జన్మించింది. ఆ పాపకు లీలా దేవి మైనేని అని నామకరణం చేశారు. అలాగే కొన్ని నెలల క్రితం భార్య, కూతుర్ని తీసుకుని శర్వా విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఇంతలోనే శర్వానంద్ దంపతులు విడివిడిగా ఉంటున్నారనే వార్త తెరపైకి వచ్చింది. విడాకులు తీసుకునే ఆలోచన లేనప్పటికీ.. ప్రస్తుతం కొంత గ్యాప్ అవసరమని వారు భావించారట. ఇరువైపు కుటుంబ సభ్యులు ప్యాచప్ చేయాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే పరస్పర అవగాహన, అంగీకారంతో శర్వానంద్, రక్షిత ఎవరింట్లో వారు ఉంటున్నారని.. పాప మాత్రం అమ్మ, నాన్న ఇద్దరితోనూ ఉంటోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.