సౌత్ ఇండియన్ సినిమాల్లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్‌లో ధనుష్ ఒకరు. సాధారణమైన లుక్, కానీ అద్భుతమైన నటనతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్లకే తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ సాధించిన ధనుష్.. బాలీవుడ్, హాలీవుడ్ కు సైతం తన ప్రతిభను చాటారు. ధనుష్ కేవలం నటుడే కాదు, సింగర్‌గా, లిరిసిస్ట్‌గా, నిర్మాతగా కూడా తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు. వేర్వేరు టాలెంట్స్‌తో మల్టీ ఫేస్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచాడు.
ప్రస్తుతం ధనుష్ రాబోయే తన `ఇడ్లీ కడై(తెలుగులో ఇడ్లీ కొట్టు)` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ తండ్రీ కొడుకుల అనుభందం, వారి ఇడ్లీ కొట్టు వ్యాపారం చుట్టూ సాగుతుంది. అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఇడ్లీ కొట్టు ప్రమోషనల్ ఈవెంట్ లో ధనుష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ధనుష్ హీరో అవ్వాలని అనుకోలేదట.
ఆయన డ్రీమ్ ఏంటో తెలుసా.. చెఫ్ కావడం. ఒకవేళ హీరో కాకపోయుంటే కచ్చితంగా చెఫ్ అయ్యేవాడ్ని అని గతంలో ధనుష్ స్వయంగా వెల్లడించారు. తాజాగా మరోసారి ఈ విషయంపై ఆయన మాట్లాడారు. ``ఒకప్పుడు నేను చెఫ్ కావాలని బలంగా కోరుకున్నాను. ఆ కోరిక వల్లేనేమో ఈ మధ్య కాలంలో నాకు అన్ని అలాంటి పాత్రలే దక్కుతున్నాయి. `జగమే తందిరం`లో పరోటాలు వేశాను, `తిరుచిత్రాంబళం`లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేశా, `రాయన్'లో ఫాస్ట్ ఫుడ్ షాప్ నడిపా. ఇప్పుడు ఈ `ఇడ్లీ కడై`లో ఇడ్లీలు వేశా.
కథ నేను రాసుకున్నా, వేరే డైరెక్టర్స్ నా దగ్గరకు వచ్చినా.. నాకు ఇలాంటి పాత్రలే వస్తున్నాయి. దీన్నే మ్యానిఫెస్టేషన్ అంటారేమో. మనం ఏదైతే స్ట్రాంగ్ గా థింక్ చేస్తామో అదే అవుతాం. నా విషయంలో అదే జరుగుతుంది. యువత కూడా తమ లక్ష్యాలను బలంగా నమ్మి కష్టపడాలి. అలా చేస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు.`` అంటూ ధనుష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.