పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ `ఓజీ`. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాంబోతోంది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ఆ హైప్‌ను తారా స్థాయికి చేర్చింది.
ఇప్పుడెక్కడ చూసినా ఓజీ మ్యానియానే నడుస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీ రిలీజ్ ను ఒక సెలబ్రేషన్‌లా చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు డుదల డేట్ దగ్గదపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. అందులో భాగంగానే నేటి(సెప్టెంబర్ 21) సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లోనే మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ ను కూడా విడుదల చేయాలని భావించారు.
భారీ ఎత్తున జరగబోతున్న ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్ కు హాజరు కావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఎంట్రీ పాస్‌లకు హెవీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా చూసుకుని కొందరు ఈ పాస్‌లను అధిక రేట్లకు బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. 2011లో పవన్ కళ్యాణ్ నటించిన `పంజా` సినిమా ఆడియో రిలీజ్ పంక్షన్ సైతం ఎల్బీ స్టేడియంలోనే జరిగింది. ఈ ఈవెంట్ అప్పట్లో ఒక సెన్సేషన్.
నాడు పంజా ఆడియో పంక్షన్‌కు ఎంతో మంది అభిమానులు హాజరయ్యారు. స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో.. అందుకు నాలిగింతల జనాలు స్టేడియం బయట రోడ్డుపై ఉన్నారు. ఈ ఈవెంట్ గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఓజీ ఆడియో పంక్షన్ సేమ్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పుడు ఓజీకి ఎంత హైప్ ఉందో అప్పట్లో పంజా మూవీకి కూడా అంతే హైప్ ఉంది. కానీ పంజా సినిమా డిజాస్టర్ అయింది. మరి ఓజీ రిజల్డ్ ఎలా ఉండనుందో చూడాలి.