ప్రస్తుత రోజుల్లో హీరోయిన్లు బికినీ వేయడం వింతేమి కాదు. కథకు అవసరమైతే, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే, లేదా ఫ్యాషన్ షూట్స్‌కు హీరోయిన్లు బికినీ లుక్స్‌ను బోల్డ్‌గా అంగీకరిస్తున్నారు. బికినీ ఒక సాధారణ డ్రెస్‌లా మారిపోయింది. అయితే నేటితరం హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి చాలా భిన్నం. ఈ బ్యూటీ గ్లామర్ షోతో కాకుండా సహజ అందంతోనే ప్రసిద్ధి చెందింది. ఆమె డ్రెసింగ్ స్టైల్ సింప్లిసిటీని ప్రతిబింబిస్తుంది. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్‌లోనూ చీర, సల్వార్, లాంగ్ స్కర్ట్స్, కుర్తీలు వేసుకుని కనిపిస్తుంది.
అలాంటి ఈ నేచురల్ స్టార్ అకస్మాత్తుగా బికినీ లుక్ లో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన సిస్టర్ పూజా కన్నన్‌తో విదేశాలకు వెకేషన్ కు వెళ్లిన సాయి పల్లవి.. అక్కడ బీచ్‌లో బికినీ వేసి ఫుల్ ఎంజాయ్ చేసింది. పూజా కన్నన్ కూడా టూ పీస్ బికినీలో అందాలను ఆరబోసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
స్క్రీన్ మీద గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఎప్పుడూ సహజంగా కనిపించే సాయి పల్లవిని బికినీలో చూసి ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా షాకైపోతున్నారు. సాయి పల్లవి బికినీ వేసిందా..? నమ్మలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నేటి తరం హీరోయిన్లు ఫ్యాషన్‌తో బోల్డ్ అవతారాలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ లిస్ట్‌లో సాయి పల్లవి చేరడం నిజంగా ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం`లో సీతగా నటిస్తోంది. అలాగే సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ `మేరే రహో` షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది.