వెయిటింగ్ ఓవర్.. ఫ్యాన్స్ మరియు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూసిన `ఓజీ` ట్రైలర్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ యాక్ట్ చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనుంచగా.. థమన్ సంగీతం అందించారు.
దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న ఓజీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఊరిస్తూ ఊరిస్తూ తాజాగా మేకర్స్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. `బొంబాయి లో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. అయితే ఈ సారి గన్స్ అన్నీ సత్య దాదా(ప్రకాశ్ రాజ్) వైపు తిరిగాయి అనే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను రెండింతలు చేసేసింది. పవన్ గ్యాంగ్‌స్టర్ లుక్, స్టైల్, స్వాగ్ గూస్‌బంప్స్ తెప్పించాయి. తమన్ సంగీతం, బీజీఎం సినిమాకు ఆయువుపట్టు.
`బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త` అంటూ విలన్ కు కాల్ చేసి పవన్ వార్నింగ్ ఇవ్వడం హైలెట్. యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఓజాస్ గంభీర(ఓజీ) పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు. స్టోరీ సర్ప్రైజింగ్ గా ఉండకపోవచ్చు.. కానీ సుజీత్ మేకింగ్ స్టైల్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుందని ట్రైలర్‌తోనే స్పష్టమైంది. సినిమా ఎంత స్టైలిష్ గా ఉంటుందో ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. మొత్తానికి ఓజీ ట్రైలర్ అదిరిపోయింది. లేట్ అయినా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశారు. ట్రైలర్ చూసి బొమ్మ బ్లాక్ బస్టర్ అని సినీ ప్రియులు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం.