ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ నిరసన తెలిపేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
ఏ పథకానికి ప్రజలకు ప్రభుత్వం ఎంత బాకీ పడింది అనే వివరాలు వెల్లడిస్తూ బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఇన్నోవేటివ్ థింకింగ్ తో విడుదల చేసిన కాంగ్రెస్ "బాకీ కార్డు" సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ "బాకీ కార్డు"ను కేటీఆర్, హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అబద్ధపు ఆమె లేచి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో ప్రజలకు తెలియజేసేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేందుకు ఈ బాకీ కార్డులకు రూపొందించామని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు... రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామని ప్రకటించారు.