శాసనమండలి చైర్మన్ మోషెస్ రాజుకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని శాసనమండలిలో వైసిపి సభా పక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కొత్త భవనాల ప్రారంభోత్సవానికి మండలి చైర్మన్ ను ఆహ్వానించలేదని బొత్స ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
శాసనసభ, శాసనమండలి క్యాంటీన్లను ఒకసారి చూడాలని చైర్మన్ ను బొత్స కోరారు. రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో, మీకే తెలుస్తుందని అన్నారు. రెండు సభల క్యాంటీన్లలో తేడా ఉందని చాలా మంది ఎమ్మెల్సీలు చెప్పారని, సెక్రెటరీకి 10 సార్లు చెప్పినా మార్పు లేదని మండలి చైర్మన్ మోషేస్ రాజు అసహనం వ్యక్తం చేశారు.
అయితే, తనకు తెలిసి ఇటువంటి తేడా ఏమీ లేదని, , ఒకవేళ చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ, శాసనమండలి రెండిటికి టీ, కాఫీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్ సప్లై చేసేది ఒకే కాంట్రాక్టర్ అని చెప్పారు. ఈ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని, ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు సభలో చర్చకు రావాల్సి ఉందని అన్నారు.