ఏపీ సీఎం చంద్రబాబుపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు పాలనలో ఏపీ చరిత్ర దేశ పటంలో సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. విజయవాడ ఉత్సవ్ – 2025లో భాగంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్‌ను బాలయ్య ప్రారంభించారు. అమరావతికి చంద్రబాబే బ్రాండ్ అని అన్నారు.
ఏపీలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తోందని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కళకు చావు లేదని, నేటి తరానికి కళల ప్రాముఖ్యతను వివరించాల్సిన అవసముందని అభిప్రాయపడ్డారు. కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట వంటి సంప్రదాయ కళలు కృష్ణా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు.
సినిమాల రాజధాని విజయవాడ అని, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతోమంది కృషి చేశారని కొనియాడారు. అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.