ప్రపంచ హృదయ దినోత్సవం..మీ గుండె పదిలమేనా?

admin
Published by Admin — September 29, 2025 in International
News Image
గుప్పెడంత గుండె...మనిషి ఆరోగ్యానికి ఎంతో కీలకం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే, వైద్యులు గుండెను పదిలంగా కాపాడుకోమని సూచిస్తుంటారు. అధిక కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉంటూ గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చూసుకోవాలని సలహా ఇస్తుంటారు. రోజువారీ పనుల్లో నడకతోపాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచొచ్చని చెబుతుంటారు. ఆధునిక జీవన శైలి, ఎక్కువ సేపు కూర్చొని ఉండే పనులు చేసే పరిస్థితులు, వాకింగ్ చేయకపోవడం వంటి కారణాలతో ఏటా చాలామంది గుండెపోటుకు గురై చనిపోతున్నారు. మీ గుండె ఎంత పదిలంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.

ఈ రోజు అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా...

అమ్మను మించి దైవమున్నదా...
ఆత్మను మించి అర్థమున్నదా...

అమ్మ ఇచ్చిన దేహంలో
అన్నిటినీ మించిన అవయవం గుండె..
హృదయం కదలికే మన ఊపిరి..
అది ఉన్నంతవరకే
మన శ్వాస..
అది ఆడమన్నట్టు
నువ్వు ఆడకపోయినా...
అది ఆడుతున్నంత సేపే
నువ్వు ఆడేది..!

నీ రక్త ప్రసరణ..
ఉచ్వాశనిశ్వాసాలు..
నీ భయం..నీ అభయం..
నీ ఆరోగ్యం..
నీ మహాభాగ్యం..
*నీ భావం..నీ శైవం..*
*అదే ఆగిపోయిన నాడు*
*నువ్వు శవం..!*

*_చూసుకో పదిలంగా.._*
*_హృదయాన్ని అద్దంలా.._*
కదిలేది కాలం ఏదైనా..
రగిలేది నీలో వేదన..!

కవి చెప్పినా..రవి చెప్పినా
*_ఆ గుండెను కాపాడుకొమ్మనే.._*
అనవసర ఆలోచనలు..
కలుషిత శ్వాసలు..
వృధా ప్రయాసలు..
ఆపై ఆయాసాలు...
వీటికి దూరంగా
నీ గుండె ఉంటే
నువ్వు బండ..
అప్పుడు నువ్వు కావెవరికీ
ఓ గుదిబండ..!

నీకు అవసరమేమో
కుట్రలు..కుతంత్రాలు..
పనికిరాని విషయాలపై అటెన్షన్లు..
నిజానికి అవన్నీ
నీ గుండె
తట్టుకోలేని టెన్షన్లు..!
ఇవన్నీ వద్దు వద్దురాని
నీ గుండె ఎప్పుడూ
ఇస్తుంది కాషన్లు..
పట్టించుకోని నీకు
లేనిపోని పరేషాన్లు..
ఆపై ఆపరేషన్లు..!

*స్టెంటు..బైపాస్..*
*ఓపెన్ హార్ట్..*
*_పరాకాష్టగా గుండె మార్పిడి.._*
వీటన్నిటికీ కారణం..
నీలోని రాపిడి..
అతిగా ఆశపడి
సంపాదించే ధనం..
అందుకోసం అంతర్మధనం..
నీ యాతన..నీ వేదన..
అదంతా నీ గుండెకు కోత..
నీ వెత..నీ కలత..
అంతిమంగా
నీ గుండెకు నలత..!

*_గుండె మంట.._*
_*గుండె కోత..*_
*_గుండె కరిగి.._*
*_గుండెల్లో గుడి.._*
ఇలా గుండెకు
ఎన్నో భాషలు..
అవే నీ జీవితకాలపు ఘోషలు..
అలా గుండె రాయి
చేసుకుని నువ్వుంటే
నువ్వో బండరాయి..
సాటి మనిషి కష్టానికి
నువ్వు కరిగితే
నువ్వు మానవతకే
కలికితురాయి..
నీ గుండెలో
శాంతి దూత పావురాయి
ఉన్నంత కాలం నీ జీవితం
హాయి హాయి..!

*_గుండె మంటలారిపే_*
*_సన్నీళ్లు కన్నీళ్లు.._*
*_ఉండమన్న ఉండవమ్మ_*
*_సాన్నాళ్ళు.._*
నీ గుండె..నీ ఆస్తి..
అది చెదిరితే..చెడితే..
ఇక నీ బ్రతుక్కే స్వస్తి..!
Tags
world heart day heart health heart walking minimum excercise
Recent Comments
Leave a Comment

Related News