జగన్ సర్కార్ ట్రూ అప్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడిన సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు చంద్రబాబు ప్రభుత్వం 15 నెలలుగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దసరా కంటే ముందే పండుగ చేసుకునే వార్త చెప్పారు. ట్రూ డౌన్ తో విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించబోతున్నామని ప్రకటించారు.
దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ తో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ర్జీ చల భారం మోపిందని, కానీ, 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో సత్ఫలితాలు రాబట్టి చార్జీలు తగ్గించగలుగుతున్నామని అన్నారు.
ఇతర రాష్ట్రాలతో పవర్ స్పాపింగ్ చేయబోతున్నామని, అధిక ధరలకు విద్యుత్ కొనే విధానానికి స్వస్తి పలికామన్నారు. యూనిట్ కు 13 పైసలు చార్జీలు తగ్గబోతున్నాయని నవంబర్ నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నామని, ఈ ప్రకారం 923 కోట్ల భారం ప్రజలపై తగ్గనుందని అన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా భవిష్యత్తులో భారీ సంఖ్యలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు తీసుకువస్తామని, మరింత చౌక ధరలకు విద్యుత్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు.