బ్యాంకుతో సుబ్బరామిరెడ్డి కుటుంబం వన్ టైం సెటిల్మెంట్..5700 కోట్లు రుణ మాఫీ

admin
Published by Admin — October 01, 2025 in Politics, Andhra
News Image

"కళాబంధు"  టీ. సుబ్బరామి రెడ్డి తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే. అలనాటి ప్రముఖ హాస్యనటులు రమణారెడ్డి సోదరుడి కుమారుడే ఈ సుబ్బ రామిరెడ్డి. సినీ రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలలో పలువురితో పరిచయాలున్నాయి. అయితే, బ్యాంకుతో చేసుకున్న వన్ టైమ్ సెటిల్మెంట్ నేపథ్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యుల యాజమాన్యంలోని గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ మీద ఎన్సీఎల్టీలో దివాళా పిటిషన్ దాఖలైంది.

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియానికి ఆ కంపెనీ దాదాపు 8100 కోట్లు బకాయి పడింది. అయినా సరే ఆ కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదట. దీంతో, ఆ కంపెనీ ప్రమోటర్లు టీ.సుబ్బరామి రెడ్డి కుటుంబ సభ్యులు 2,400 కోట్లు చెల్లిస్తామంటూ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద బంపర్ ఆఫర్ ఇచ్చారట. దీంతో, ఆ బ్యాంకుల కన్సార్టియం వారు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న రీతిలో ఆ ఆఫర్ ను స్వీకరించారట. ఆ సెటిల్మెంట్ ద్వారా బ్యాంకుల కన్సార్టియానికి 5,700 కోట్లు నష్టం...సుబ్బరామిరెడ్డి కుటుంబానికి 5700 కోట్లు లాభం. ఒక్క దెబ్బతో సుబ్బరామి రెడ్డి కుటుంబానికి 5,700 కోట్ల అప్పు సింగిల్ స్ట్రోక్ తో క్లియర్ అయ్యాయి..

90వ దశకంలో తన అభిమాన సంఘాలకు ఐదేసి లక్షలు విరాళంగా ఇచ్చిన సుబ్బరామిరెడ్డి జీవితం ఆశాంతం విలాసాలతో నిండిదేనని సినీ, రాజకీయ వర్గాల్లో టాక్. ఈ రకంగా సంపాదించిన తన కష్టార్జితం కాని డబ్బుతో ఆయన సినిమా అవార్డు ఫంక్షన్లు ఏర్పాటు చేశేవారని విమర్శలున్నాయి. వైజాగ్ బీచ్ లో సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసే శివుడి పూజకు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లలో సినీతారలను తీసుకు వెళ్లాలంటే చాలా డబ్బులు కావాలి.

ఇక, తన సామాజిక వర్గానికే చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్ గా పదవి చేపట్టిన సుబ్బరామిరెడ్డి ఆ పదవిని దుర్వినియోగపరిచారని ఆరోపణలున్నాయి. తనకు వ్యాపార ప్రయోజనాలు కల్పించిన వారికి తిరుమలలో రాచ మర్యాదలు చేసేవారట. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ...వీరందరికీ ఎన్డీఏ సర్కార్ మద్దతుందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటారు. మరి, కాంగ్రెస్ వాది అయిన సుబ్బరామిరెడ్డి కూడా బ్యాంకుకు ఎగవేత దారుడిగా మారిన నేపథ్యంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మార్గదర్శి డిపాజిట్ల విషయంలో డిపాజిట్ దారులకు ఒక్క రూపాయి నష్టం జరగకున్నా స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న ఫీలింగ్ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్...తనతో కలిసి పార్టీలో కలిసి పనిచేసిన సుబ్బరామిరెడ్డి విషయంలో చిన్న కామెంట్ కూడా చేయలేదు. మొండి బకాయిలతో ఇబ్బంది పడుతున్న బ్యాంకులకు పార్లమెంట్ ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలు బెయిల్ ఔట్ ప్యాకేజ్ సమకూర్చింది కేంద్ర ప్రభుత్వం.
ప్రజలు కట్టిన పన్నుల డబ్బు పార్లమెంట్ ద్వారా బ్యాంకులకు ఉదారంగా సమకూర్చారన్నమాట.

ఒక సాధారణ రైతు క్రాప్ లోన్ సకాలంలో కట్టకున్నా, ఒక మధ్యతరగతి మనిషి హోమ్ లోన్ ఈఎంఐ సమయానికి చెల్లించకపోయినా బ్యాంకు సిబ్బంది, రికవరీ ఏజెంట్లు రాబందుల్లా పీక్కు తింటారు. కానీ, ఇలాంటి కళాబంధులను ఆ రాబందులు ఏమీ చేయవు. కాబట్టి, ఎలాగోలా ఛోటామోటా నాయకుడిగా ఎదగితే ఎంచక్కా మనం కూడా వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినా...రుణ మాఫీ చేసేస్తాయి. ఆ తర్వాత బ్యాంకులు చేసిన రుణమాఫీతో జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పై పెచ్చు పెద్ద మనిషిగా సమాజంలో చలామణీ కావచ్చు. లేదంటే సుబ్బరామిరెడ్డిలాగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని మనం బ్యాంకుకు ఇవ్వవలసిన అప్పును తిరిగి బ్యాంకు నుంచే పొందవచ్చు.

Tags
T.Subbaramireddy's family 5700 crores waived off debt one time settlement
Recent Comments
Leave a Comment

Related News