తీరం దాటిన వాయుగుండం కారణంగా.. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలు చివురుటాకులావణుకు తున్నాయి. మరోవైపు ఇంకో వాయుగుండం ప్రభావంతో నింగికి చిల్లు పడినట్టుగా వర్షాలుకురుస్తున్నాయి. దీనికితోడు వాయుగుండం ప్రభావంతో భారీ ఎత్తున గాలులు వీస్తున్నాయి. దీంతో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితిదారుణంగా మారింది. ఎక్కడికక్కడ విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు వంటివి రహదారులను పూర్తిగా మూసేశాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల నుంచినగరాల వరకు కూడా పలు ప్రాంతాలు మోకాల్లోతు నీటిలో నానుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఒడిశాపై తీవ్ర ప్రభావం ఉండడంతో ఆ రాష్ట్రంలోని అరబంగి, బడనాలా రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో వంశధార ఉధ్రుతి భయంకరంగా మారింది. దీంతో స్థానికంగా ఉన్న అనేక ప్రాంతాలు నీటమునిగాయి. నదీపరివాహక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అక్కడి నుం చి తరలించారు. ఈ ముంపులో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష నివాసం కూడా పూర్తిగా మునిగిపోయింది. అయితే.. ఆమె అప్పటి కే బయటకు వచ్చేశారని తెలిసింది. ఇక, లోతట్టు ప్రాంతాలలో ఇళ్లు.. చెరువులను తలపిస్తున్నాయి.
నలుగురు మృతి..
తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన వర్షాటతో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. మరోవైపు వందల సం ఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాల్లో ఉంచి సహాయం చేస్తున్నారు. విశాఖ, విజయనగరంలో వర్షాలుకురుస్తుండగా.. శ్రీకాకుళంలో వంశధార, నాగావళి నదులు మహోగ్ర రూపం దాల్చాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోక లను నిలిపివేశారు. జాతీయరహదారిని కూడా మూసివేశారు. మరోవైపు.. ప్రభుత్వం దీనిపై అన్ని కోణాల్లోనూ సమాచారం సేకరిస్తోంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. మృతులకు సీఎం చంద్రబాబు ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ప్రకటించారు.