``వైసీపీ లాంటి నీచ పార్టీ ఎక్కడా లేదు. అదొక అరాచక పార్టీ. అరాచక ప్రభుత్వం. ఇక, ఎప్పటికీ.. ఆ పార్టీ అధికారంలోకి రాదు.`` అని గోవా గవర్నర్, టీడీపీ మాజీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు అన్నా రు. వైసీపీ తనను అనేక రూపాల్లో వేధించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారి పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గోవా గవర్నర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ నిదర్శనమన్నా రు. తాను కేంద్ర మంత్రిగా దేశవ్యాప్తంగా తిరిగానని.. కానీ, ఎక్కడా ఇలాంటి నీచ పార్టీని చూడలేదన్నారు. గోవాలోనూఅధికార, ప్రతిపక్షాలు ఉన్నాయని.. కానీ, ఇంత నీచంగా ఎవరూ వ్యవహరించలేదని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలను ధ్వంసం చేయడంతోపాటు.. ఆధ్యాత్మిక వ్యవస్థను కూడా తీవ్రస్థాయిలో నాశ నం చేసిన ప్రభుత్వం వైసీపీదేనన్నారు. తనను వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పెట్టారన్నారు.
``వంశపారంపర్య ధర్మకర్తగా నేను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారు.`` అని నాటి సంగతు లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రామతీర్థంలోని శ్రీరామ చంద్రమూర్తి విగ్రహం.. శిరచ్ఛేదం జరిగిన విష యం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం మౌనం పాటించింది. ఇదే విషయా న్ని తాను ప్రశ్నిస్తే.. అప్పటి పోలీసులు తనపై కేసు నమోదు చేశారని అశోక్ గజపతి రాజు తెలిపారు. సింహా చలం దేవస్థానంలోనూ తమ గౌరవాన్ని తగ్గించారని పేర్కొన్నారు.
దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకదశలో మాన్సాస్ సం స్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఏడిపించారని, దీంతో వారంతా తనకు వచ్చి చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో చిరుద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ప్రశ్నించినందుకు తనపై క్రిమినల్ కేసు పెట్టారని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అందుకే.. అలాంటినీచ పార్టీని, నీచ పాలకులను కూడా తాను చూడలేదన్నారు.