ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో భారీ దెబ్బ తిన్న జగన్‌మోహన్ రెడ్డి, ఇప్పుడు గేమ్‌ను పూర్తిగా రివర్స్ చేయాలనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని జగన్ చేపట్టిన రీబిల్డ్ మిషన్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ మిషన్‌లో భాగంగా ప్రతి జిల్లాలోనూ పార్టీని పునర్‌వ్యవస్థీకరించాలన్న దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించిన జిల్లా.. ఉమ్మడి ప్రకాశం జిల్లా.
ఇక్కడ వైసీపీ బలం క్షీణించిందన్నది స్పష్టమే. ఒకప్పుడు పార్టీకి పునాది వేసిన నేతలంతా ఇప్పుడు దూరమయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు శిక్ష కారణంగా యాక్టివ్‌గా లేకపోవడం, కరణం బలరాం పూర్తిగా సైలెంట్ కావడం వల్ల జిల్లాలో వైసీపీ కార్యకలాపాలు దాదాపు నిశ్శబ్దంగా మారిపోయాయి. ప్రస్తుతం వై.వి. సుబ్బారెడ్డి ఒక్కరే పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఉన్నా, గ్రౌండ్ స్థాయిలో పార్టీకి ఊపు తీసుకురావాలంటే కొత్త బలం అవసరమని జగన్ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు తెరపైకి వచ్చింది గతంలో వైసీపీతో ఉన్న ఆమంచి, ఆపై రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ వైపు మళ్లి, కొంతకాలం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సమాచారం ప్రకారం, జగన్ - ఆమంచి మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ప్రజల్లో కాంటాక్ట్ ఉన్న, గ్రౌండ్ కనెక్ట్ ఉన్న నేతగా ఆమంచి పేరుంది. ఆమంచి వైసీపీలోకి వస్తే.. అది జగన్‌కు కేవలం ఒక జాయినింగ్ కాదు, ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు ఇచ్చే మోటివేషనల్ మువ్. వైసీపీ కేడర్‌లో మళ్లీ స్పూర్తి నింపే సింబల్‌గా మారే అవకాశం ఉంది.
ఆమంచి వస్తే గాలి మారుతుందని ఇప్పటికే వైసీపీ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. ఇక జగన్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే, ప్రకాశం జిల్లా నుంచి మొదలైన ఈ రీబిల్డ్ మిషన్ మొత్తం రాష్ట్రానికి ఎనర్జీ ఇస్తుందనడంలో సందేహం లేదు. కాగా, కాంగ్రెస్ పార్టీ ద్వారా 2009లో చీరాల నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమంచికి 2014 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి చేరారు. కానీ చీరాల నుండి పోటీ చేసి కరణం బలరాం చేతుల్లో ఓడిపోయారు. కొద్ది కాలానికి కరణం వైసీపీ గూటికి చేరడంతో ఆమంచి కృష్ణమోహన్ లో అసంతృప్తి పెరిగింది. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కక పోవడంతో అనూహ్యంగా ఆమంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోవడం చీరాలలోనే జరగడం గమనార్హం.