కాశీబుగ్గ ఘ‌ట‌న‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ష‌న్ ఇదే!

admin
Published by Admin — November 01, 2025 in Andhra
News Image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు.. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేయడమైంది. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని, బాధిత కుటుంబా లను ప్రభుత్వం ఆదుకొంటుందని ఆయ‌న తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయం లో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుందన్నారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ప‌వ‌న్ తెలిపారు.

ఈ నేప‌థ్యంలో క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తున్నా ను. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చిన ప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర హోం శాఖ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు మంత్రి వంగ‌ల‌పూడి అనిత తెలిపారు.

మ‌రోవైపు.. జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌.. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించా రు. జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే ను అడిగి సంఘటన వివరాలను తెలుసుకున్న మంత్రి.. హుటాహుటిన కాశీబుగ్గకు బయలుదేరారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి తెలుసుకుని చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. 

Tags
kasibugga temple stampede Ap Deputy CM Pawan Kalyan first reaction
Recent Comments
Leave a Comment

Related News