హరిముకుంద్ పాండా.. ప్రస్తుతం పెద్ద ఎత్తున వినిపిస్తున్న పేరు ఇది. దీనికి కారణం.. ఆయన స్వయంగా తన సొంతభూమిలో తన సొంత నిధులతో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలా ట జరిగింది. ఈ ఘటనలో సుమారు 12 మంది వరకు మృతి చెందారని అధికారులు భావిస్తున్నారు. పదుల సంఖ్యలో భక్తులు.. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.. దీనిపై విచారణకు ఆదేశించింది.
ఈ క్రమంలో అసలు ఎవరీ హరిముకుంద్ పాండా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పాండా వ యసు 95 సంవత్సరాలు. నిజం!. అయినా.. ఆయన యాక్టివ్‌గా ఉంటారు. జీవితాంతం తల్లికి సేవ చేసుకు నేందుకు ఆయన అన్నింటినీ త్యాగం చేశానని చెప్పారు. ఇక, తల్లి అంటే అపారమైన ప్రేమానురాగాలు పంచే పాండా.. ఆమె కోరిక మేరకు.. తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం తరహాలోనే కాశీబుగ్గలో ప్రత్యేకంగా 13 ఎకరాల సొంత స్థలంలో ఆలయాన్ని నిర్మించి.. నిర్వహిస్తున్నారు. ఇక్కడ టోకెన్ సిస్టమ్.. రుసుముల వసూలు వంటివి ఉండవు.
ఇక, కుటుంబ నేపథ్యానికి వస్తే..పాండా ఒడిశాకు చెందిన రాజవంశస్థులు. పూర్తిగా విష్ణు భక్తులు. పైగా తిరుమల శ్రీవారంటే ప్రాణం పెడతారు. ఆయన మాతృమూర్తి.. హరివిష్ణు ప్రియ పాండా కోరిక మేరకు.. పలాస-కాశీబుగ్గలో సొంత ఆలయాన్ని నిర్మించారు. 92 ఏళ్ల వయసులో పాండా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. కానీ, ఒక్కరి నుంచి కూడా రూపాయి తీసుకోకుం డా.. సొంత ఆస్తులను విక్రయించి.. వారసత్వంగా వచ్చిన సొత్తును పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించారు.
అంతేకాదు.. పాండా సమాజ సేవకులుగా పేరు తెచ్చుకున్నారు. నిత్యం ఆలయ పరిసరాల్లో నిర్మించిన ప్రత్యేక కేంద్రంలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. రోజుకు రెండు సార్లు పేదలు అనాథలకు.. నిత్యా న్న భోజనం పెడుతున్నారు. 95 ఏళ్ల వయసులోనూ పాండా యాక్టివ్‌గా నడుస్తారు. అన్నీ తెలుసుకుంటా రు. కాగా.. తాజాగా ఆయన నిర్మించిన శ్రీవారి ఆలయంలో కార్తీక ఏకాదశని పురస్కరించుకుని తండోపతం డాలుగా భక్తులు రావడంతో నియంత్రణ వ్యవస్థ లేక.. తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు మృతి చెందడం విషాదం.